Header Banner

ఒంటిమిట్టలో శోభాయమానంగా శ్రీరామ కల్యాణం..! టీటీడీ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం!

  Sat Apr 12, 2025 15:58        Politics

కడప జిల్లాలోని సుప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిన్న సీతారామ కల్యాణ మహోత్సవం కనుల పండుగలా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. దీనిపై ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. నిన్న ఒంటిమిట్టలో జరిగిన శ్రీరామ కల్యాణ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేయడంపై సంతోషం వెలిబుచ్చారని తెలిపారు. చంద్రబాబు ఒంటిమిట్ట శ్రీరామునికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, కల్యాణాన్ని ఆసాంతం తిలకించారని బీఆర్ నాయుడు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కల్యాణోత్సవం జరగడం సంతోషదాయకమని సీఎం అన్నారని వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు తనను అభినందించిన ఫొటోలను కూడా బీఆర్ నాయుడు పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SitaramaKalyanam #Ontimitta #CMChandrababu #TTD #DivineCelebration #RamNavamifc